
Pumpkin seeds : గుమ్మడితో కూర చేసుకుంటాం. పులుసు పెట్టుకుంటాం. సూప్ చేసుకుంటాం. స్వీట్లు తయారు చేస్తుంటాం. గుమ్మడితో ఎన్నో రకాల వంటలు చేయడం సహజం. గుమ్మడి గింజలు కూడా మనకు చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తాయి. గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్ ఎ,సి,ఇ ఉంటాయి. ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఫ్యాటీ యాసిడ్లు, పాస్పరస్, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్లు, ఫాస్పరస్, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్ తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. కంటి చూపును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బీటా కెరోటిన్ చర్మాన్ని సంరక్షిస్తుంది. వాపులను తగ్గిస్తుంది. గుమ్మడి గింజల్లో చాలా రకాల ప్రయోజనాలు మనకు అందుతాయి.
అధిక రక్తపోటును నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తాయి. అందుకే వీటిని తరచుగా తీసుకుంటూ ఉంటే మన గుండెకు రక్షణ కలుగుతుంది. ఒత్తిడిని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇలా గుమ్మడి గింజలు మన ఆరోగ్య పరిరక్షణలో పాటుపడతాయి.
ఇందులో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. అజీర్తి సమస్య రాకుండా చేస్తాయి. పేగు కదలికలను ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియకు సంబంధించిన అంశాల్లో ఇవి ఎంతో సహకరిస్తాయి. క్యాన్సర్ నుంచి కూడా ఇవి రక్షిస్తాయి. ఇలా గుమ్మడి గింజల్లో ఉండే విటమిన్లు, ఫ్రీ రాడికల్స్, ప్రొటీన్లు మనకు చాలా మేలు చేస్తాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది.