love today లవ్ టుడే సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సినిమాలో హీరోహీరోయిన్లు ఫోన్లు మార్చుకోవడాన్ని అద్భుతంగా చూపించారు. దీంతో నిజ జీవితంలో కూడా అలాగే చేయాలని అనుకున్నారో జంట. కానీ అది సినిమా ఇది జీవితం. దీంతో వరుడి బాగోతం బయటపడి చివరకు కటకటాల పాలు కావడం యాదృచ్ఛికం కాదు. ఫోన్లు మార్చుకున్నప్పుడు అందులో ఉన్న డేటాను తొలగించుకోవాల్సిన పని చేయకపోవడం వల్ల అడ్డంగా బుక్కయ్యాడు.
తమిళనాడు రాష్ర్టంలోని బేలూరుకు చెందిన 23 ఏళ్ల కుర్రాడు అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అదే ఊరికి చెందిన ఓ యువతితో కొద్ది రోజుల క్రితం అతడికి నిశ్చితార్థం జరిగింది. దీంతో ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకునే వారు. వీరికి లవ్ టుడే సినిమా బాగా నచ్చింది. పెళ్లికి ముందు ఒకరికొకరు తెలుసుకోవాలని భావించారు. అలా చేయాలంటే లవ్ టుడే సినిమాలోలాగా ఫోన్లు మార్చుకోవడం మంచిదనుకున్నారు. అలాగే చేసేశారు.
ఫోన్లు మార్చుకున్నా వారి ఫోన్లలో ఉన్న డేటాను మాత్రం అలాగే ఉంచారు. దీంతో యువకుడి ఫోన్లో ఓ బాలిక నగ్న వీడియో బయటపడింది. దీంతో ఆ యువతి షాక్ అయింది. వీడియో గురించి కుటుంబసభ్యులకు తెలిపింది. వారు అరవింద్ తో పెళ్లి రద్దు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ లో ఇంకెవరివైనా వీడియోలు ఉన్నాయేమోనని ఆరా తీస్తున్నారు. లవ్ టుడే సినిమా ఎంత మోసం చేసింది. వారు చేసిన పనికి అతడి జీవితమే మారిపోయింది. హాయిగా పెళ్లి చేసుకోవాల్సిన వాడు కటకటాలపాలయ్యాడు. చేసిన పాపం ఊరికే పోతుందా అంటారు కదా అది ఇదేనేమో.