OG Movie Update :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘బ్రో: ది అవతార్’ జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. దీనితో పాటు మరోవైపు పవన్ కళ్యాణ్ #OG మరోసారి వార్తల్లో నిలిచింది.
నాలుగో షెడ్యూల్ ఈ వారంలో ప్రారంభం కానుందని, ప్రధాన తారాగణం కూడా షూటింగ్ లో జాయిన్ అవుతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ తదితరులకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్, 2023లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని ఎంగేజింగ్ కథల కోసం వేచి ఉండండి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఉన్నాడు. జనసేన పార్టీకి అధినేత అయిన ఆయన పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేల ఆయన షూటింగ్ లకు కాస్త విరామం ప్రకటించారు. అయితే, #OG ఒక గ్యాంగ్ స్టర్ ఫైట్ నేపథ్యంలో కొనసాగుతన్న సినిమా. ఇది కూడా దాదాపు ఎన్నికల తర్వాతనే విడుదలయ్యేట్లు కనిపిస్తుంది. బ్రో సినిమా కంటే ముందే షూటింగ్ ప్రారంభమైనా ఇంకా పూర్తి కాలేదు.