Vijay devarakonda : యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యువ హీరోల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. విజయ్ ఏ ప్రెస్ మీట్ లో నైనా తన పెళ్ళి గురించిన ప్రశ్నలు ఎదుర్కొంటున్నాడు. త్వరలో పెళ్ళిపీటలు ఎక్కనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాడు. పెళ్ళి గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు కానీ తనకు వివాహ వ్యవస్ధ పై నమ్మకం ఉందని వివరించాడు.
ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోలలో పెళ్లి కాని యువహీరోలు లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. అందులో రౌడీ హీరో విజయ్ కూడా ఉన్నారు. కెరీర్ లో స్టార్ డమ్ గా గుర్తింపు పొందినా.. చాలా కాలంగా సూపర్ హిట్ ను పొందలేకపోయాడు. సహజంగానే విజయ్ కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. అందులో కొందరైతే అయితే… పెళ్ళి విషయంలో మాత్రం అమ్మాయిలనుండి వార్నింగ్ లు కూడా అందుకుంటున్నాడు. అమ్మాయిల్లో క్రేజీ ఫాలోయింగ్ పీక్ లో ఉంది. అయితే విజయ్ ఎక్కడికెళ్ళినా పెళ్ళి గురించిన రొటీన్ క్వశ్చన్ ఒకటి వినిపిస్తూ ఉంది. గతంలో దీనికి కాస్త కోపంగా సమాధానం ఇచ్చేవాడు విజయ్. కాని ఇప్పుడు మాత్రం చాలా ఓపికగా రిప్లై ఇవ్వడం మొదలుపెట్టాడు
సమంత, విజయ్ దేవరకొండ జంటగా కలిసి నటించిన సినిమా ‘ఖుషి’ సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ హిట్ లేని విజయ్ కు .. ఈసారి‘ఖుషి’ తో కొంత రిలీఫ్ దొరుకుతుందని అభిమానులు ఎదరు చూస్తున్నారు. ఇంతకుముందు పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘లైగర్’ మూవీ సక్సెస్ రాకపోవడంతో ఇప్పుడు మంచి రొమాంటిక్ లవ్ స్టోరీతో విజయ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు హీరోయిన్ సమంత కూడా ‘శాకుంతలం’ హిట్ కాకపోవడంతో ఈ సినిమాతోనైనా అంచనాలు మారుతాయని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం వీరిద్దరికి హిట్ తప్పనిసరి కావల్సిందే. వీరి కాంబినేషన్ లో వస్తున్న ‘ఖుషి’ చిత్రం హిట్ కావడం ఇద్దరికి చాలా ముఖ్యం. లేకపోతే కెరీర్ పరంగా కాస్త ఇబ్బందుల్లో పడుతారని అందరూ భావిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇప్పటికే రిలీజైన మూడు పాటలు పేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. అందులో ఓ సాంగ్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో వీరవిహారం చేస్తుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఖుషీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది. లవ్ మ్యారేజ్.. సంసార జీవితం లో వచ్చే గొడవలు నేపథ్యంలో రాబోతున్నట్టు సమాచారం. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమా లో తనదైన శైలిని మరోసారి చూపించబోతున్నాడు.
‘ఖుషి’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది చిత్రబృందం. ఓ మీడియా ప్రతినిధి విజయ్ దేవరకొండని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడిగాడ. విజయ్ దేవరకొండ దీనికి స్పందిస్తూ.. ఒకప్పుడు పెళ్లి గురించి మాట్లాడాలంటే చాలా చిరాకు వచ్చేది. నా స్నేహితుల్లో చాలా మంది ఇప్పుడప్పుడే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు వారితో పెళ్లి తర్వాత ఉన్న జీవితం గురించి తెలుసుకుంటాను. వారు వారి లైఫ్ లో జరిగిన సంఘటనలు విన్నాక పెళ్ళిపై తనకున్న భయాలన్నీ పోయాయని తెలిపాడు. ఇక సాధ్యమైనంత తొందరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు షాకింగ్ విషయం బయటపెడ్డాడు విజయ్.