39.5 C
India
Thursday, May 2, 2024
More

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ దూకుడు వెనక కనిపించని శక్తి..  ఎవరో తెలుసా

    Date:

    Sunrisers Hyderabad
    Sunrisers Hyderabad

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈ ఐపీఎల్ సీజన్ లో దూకుడుకు మారుపేరుగా మారిపోయింది. ఎస్ ఆర్ హెచ్ టీం బ్యాటర్లు భారీ సిక్సర్లు కొడుతుంటే ప్రత్యర్థి జట్ల బౌలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ సీజన్ లో ఇప్పటికే రెండు సార్లు రికార్డు బ్రేక్ చేసిన సన్ రైజర్స్ 287 పరుగులలో ఐపీఎల్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

    అయితే ఈ సీజన్ కు ముందు వరకు సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పోటీ పడేది. 2016 సీజన్ లో టైటిట్ విన్నర్ అయిన సన్ రైజర్స్, 2018 లో రన్నర్ గా నిలిచింది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో కప్ గెలవగా.. కేన్ మామా కెప్టెన్సీలో చెన్నై పై ఓడిపోయి రన్నర్ గా సరిపెట్టుకుంది. ఇక అక్కడి నుంచి ఈ సీజన్ వరకు ఎక్కడ కూడా సన్ రైజర్స్ ప్రభావం చూపలేదు. ఆటగాళ్లను మారుస్తున్న, కోట్లు పెట్టి విదేశీ ప్లేయర్లను కొంటున్న సన్ రైజర్స్ చివరి స్థానంలో నిలిచి పరువు పొగొట్టుకునేది.

    కానీ 2024 ఐపీఎల్ సీజన్ లో సరికొత్త సన్ రైజర్స్ కనిపిస్తోంది. గ్రౌండ్ లో దిగగానే కొత్త ఎనర్జీని క్రియేట్ చేసుకుంటుంది. బ్యాటింగ్ లో ముందు నుంచే ఎటాకింగ్ చేస్తుంది. ప్రత్యర్థి బౌలర్లను కుదురుకోనివ్వడం లేదు. దీనంతటికీ కారణం.. కెప్టెన్ కమిన్స్, ఓనర్ కావ్య మారన్ తీసుకున్న నిర్ణయాలు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ తెర వెనక ఉన్న ఆ చాణక్యుడు సన్ రైజర్స్ కోచ్ డానియల్ వెటోరి.

    వెటోరీ ఈ సీజన్ నుంచి సన్ రైజర్స్ టీం కు కోచ్ బాధ్యతలు తీసుకున్నాడు.  వెటోరి వ్యుహాలు పన్నడంలో చాలా దిట్ట. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేస్తున్న విధానం మ్యాచ్ మ్యాచ్ కు చేంజ్ గా ఉంటోంది. పరిస్థితిని బట్టి క్లాసెన్ ను మూడో స్థానంలో, లేకపోతే అయిదు లేదా ఆరో స్థానంలో తీసుకొచ్చి ప్రత్యర్థుల ప్లాన్స్ కు చిక్కడం లేదు. కొత్త ప్లేయర్లు నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్ లను సరైన సమయంలో ఆడిస్తున్నాడు. దీంతో సన్ రైజర్స్ ఆరు మ్యాచ్ ల్లో నాలుగు గెలిచి పాయింట్స్ టేబుల్ లో నాలుగో స్థానంలో ఉంది.

    Share post:

    More like this
    Related

    2thousand Crores : 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు-పట్టుకున్న పోలీసులు

    2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    Raghava Lawrence : రైతులకు ట్రాక్టర్లు.. హామీ నెరవేర్చిన లారెన్స్

    Raghava Lawrence : కొలీవుడ్ హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎంత...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    CSK Vs PBSK : చెపాక్ లో ఆధిపత్యం ఎవరిది?

    CSK Vs PBSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 49వ...

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...