Tamannaah Bhatia : సినీ ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ అనేది తరచూ వినిపిస్తున్న మాట. హీరోయిన్ లపై ఇలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం వింటూనే ఉన్నాం.. ఈ గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే హీరోల కంటే హీరోయిన్స్ కు మరింత గ్లామర్ ఉండాలి.. గ్లామర్ లేకపోతే ఈ ఫీల్డ్ లో రాణించడం కష్టం.. కెరీర్ స్టార్టింగ్ లో ఏ మాత్రం అటు ఇటుగా ఉన్న దారుణమైన ట్రోల్స్ చేస్తారు.
ఈ విషయాలను స్టార్ హీరోయిన్లు సైతం బయట పెడుతున్నారు. తాము కూడా కెరీర్ స్టార్టింగ్ లో ఇలాంటి దారుణమైన బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కున్నామంటూ చెబుతున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా సైతం తనపై దారుమైన బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చాయంటూ చెబుతుంది.. పాన్ ఇండియన్ హీరోయిన్ లలో తమన్నా ఒకరు.
ఈమెతో పాటు వచ్చిన హీరోయిన్స్ అంతా ఫేడ్ అవుట్ అయిపోయిన తమన్నా మాత్రం ఇప్పటికి రాణిస్తూనే ఉంది.. వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోయిన్ లకు కూడా పోటీగా నిలుస్తుంది. అయితే అలాంటి స్టార్ హీరోయిన్ కూడా కెరీర్ స్టార్టింగ్ లో దారుమైన కామెంట్స్ ఎదుర్కొన్నాను అంటూ చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది.
ఇంత గ్లామరస్ గా ఉన్న తమన్నాపై ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారట.. కొత్తలో నన్ను చూసి ముందు హెడ్ లైట్స్ లేవు నువ్వేం హీరోయిన్ అంటూ నా ఎద భాగాలపై దారుణమైన కామెంట్స్ చేసారని కానీ మా కుటుంబం ఇచ్చిన సపోర్ట్ తో ఇక్కడ వరకు వచ్చానంటూ ఆమె చెప్పుకొచ్చింది.