twitter ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన ఎలన్ మస్క్ గతంలో ట్విటర్ లో కొంత పెట్టుబడి పెట్టానా.. తర్వాత దాన్ని పూర్తిగా కైవసం చేసుకున్నాడు. గతేడాది 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. అందులో సమూలంగా మార్పులు తీసుకువస్తున్నారు ఆయన. గతంలో ఉద్యోగుల తొలగింపు నుంచి ప్రస్తుతం ట్విటర్ పిట్ట వరకు. ట్విట్టర్ ప్రసిద్ధ బ్లూ బర్డ్ స్థానంలో ‘X’ లోగోను చేర్చారు. సోమవారం (జూలై 24) నుంచి ట్విట్టర్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో X కనిపించింది. అయితే ఇంకా స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో మాత్రం పక్షి బొమ్మే ఉంది. దాన్ని కూడా కొన్ని రోజుల్లో మారుస్తామని సంస్థ తెలిపింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ఆఫీస్ లో ఉద్యోగులు కూడా పక్షి లోగోను తీసివేశారు. మధ్యాహ్నం వరకు, ట్విట్టర్ చివరిలో ‘er’ కనిపిస్తుంది.
ట్విటర్ లో భారీ షేర్ ఉన్న ఎలన్ మస్క్ కు దీన్ని కొనుగోలు చేయాలని లేదు. కానీ పరిస్థితుల దృష్ట్యా దీన్ని అయిష్టంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ‘ఇది ఒక శకం ముగింపు, గత 17 సంవత్సరాల ట్విట్టర్ బర్డ్ పోయిందని తిరిగి రాదని స్పష్టమైన సంకేతం’ అని ఇన్‌సైడర్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు జాస్మిన్ ఎన్‌బెర్గ్ అన్నారు. అయితే ట్విటర్ ను సమూలంగా మారుస్తానని మస్క్ ఎప్పటి నుంచో చెప్తూ వచ్చాడు.
‘X’ ఎందుకు?
ఎలన్ మస్క్ కు X అక్షరం అంటే ఇష్టం. ఆయన కంపెనీలను మొదటి నుంచి ఈ అక్షరంతోనే నడిపిస్తున్నాడు. వీటితో పాటు తన కొడుకుల్లో ఒకరిని X అని పిలుస్తాడు. ట్విటర్ కొనుగోలు చేసిన తర్వాత దాని కార్పొరేట్ పేరును X Corp. గా మార్చాడు. రీబ్రాండింగ్ పూర్తయిన ట్వీట్లన ఏమని పిలుస్తారని మస్క్ ను అడుగగా Xs అంటారని చెప్పారు. ఇక మస్క్ బిలియన్ రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ కు సీఈవోగా ఉన్నారు. దీనికి ఆయన పెట్టిన పేరు Space X. దీంతో పాటు Chat GPT కి పోటీగా xAI అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని ఈ నెలలోనే ప్రారంభించారు. 1999లో ఆయన స్టార్టప్ కంపెనీ X.com.