Pushpa 2 : సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న సీక్వెల్ ఫిల్మ్ ‘పుష్ప2’. దీని షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతుందని మేకర్స్ చెప్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి గతంలో అల్లు అర్జున్ లుక్ విడుదల చేసిన మేకర్స్ రీసెంట్ గా విలన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. భన్వర్ సింగ్ షెకావత్ గా నటించిన ఫాహద్ ఫాసిల్ లుక్ ను రీసెంట్ (ఆగస్ట్ 8)గా రిలీజ్ చేశారు. నోటిలో సిగార్ తో జర్కిన్ ధరించిన ఆయన లుక్ చూసేందుకు అదిరిపోయింది.
ఫాహద్ ఫాసిల్ భర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేసినట్లు మేకర్స్ చెప్పారు. అయితే, పుష్ప 1లో సునీల్ ను విలన్ గా చూపించినా.. పుష్ప 2లో మాత్రం మేయిన్ విలన్ భన్వర్ సింగ్ షెకావత్ అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. పార్ట్ 1 ముగింపు వచ్చే సరికి షెకావత్ కు మంచి ట్విస్ట్ ఇచ్చిన పుష్ప పార్ట్ 2లో ఆయనతోనే బిగ్ ఫైట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి.
మేకప్ విషయంలో టీమ్కొన్ని తప్పులు చేసినట్లు అర్థం అవుతోంది. భన్వర్ సింగ్ షెకావత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్ మేకప్ ను ఎందుకు పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తిగా మేకప్ సెట్ కాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జర్కిన్, సిగార్ వరకు బాగానే తలపై మాత్రం మేకప్ కుదరలేదని అనుకుంటున్నారు. స్మాల్ పిక్చర్స్ చూస్తే గుండులాగా క్యాప్ పెట్టారని స్పష్టంగా తెలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక దీన్ని సవరించి మళ్లీ రిలీజ్ చేస్తారా వేచి చూడాలి.