40.8 C
India
Sunday, April 28, 2024
More

    Venuswami Jyothisyam : రష్మిక, విజయ్ దేవరకొండపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్!

    Date:

    Venuswami Jyothisyam
    Venuswami Jyothisyam on Rashmika and Vijay Devarakonda

    Venuswami Jyothisyam : సినిమావాళ్లు జాతకాలను, సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతుంటారు. అందుకే స్వాములు, బాబాలు, జ్యోతిషుల దగ్గరకు వెళ్తుంటారు. రాళ్లు, కెంపులు, వజ్రాలు..ధరిస్తే వారి కెరీర్ బాగుంటుందని చెబితే అవే పాటిస్తుంటారు. అలాగే వారి పేర్లలోని అక్షరాలను, అవసరమైతే పేర్లను మార్చుకోమంటే.. అది కూడా చేస్తారు. స్వాములు ఎంత చెపితే అంతా.. కొందరు స్వాములు సినిమా స్టార్స్ ను తమ పాదక్రాంతులను కూడా చేసుకుంటారు. దీనికి ఉదాహరణ రంజిత. ఈమె నిత్యానంద అనే బురిడి స్వామిని తెగ ఆరాధించింది. అఖరికి ఆయనతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయింది. ఇటు సినిమాలు లేక, అటు అవమానాల పాలై.. చివరకు నిత్యానంద ఆశ్రమంలోనే సెటిల్ అయ్యింది. ఇలా సినిమా తారలకు, స్వాములకు అవినాభావ సంబంధం ఉందనే చెప్పాలి.

    ఇక మన తెలుగులో కూడా స్వాములు, జ్యోతిషుల ప్రభావం ఎక్కువే. తమ కెరీర్ దూసుకెళ్లే మంత్రమో, తంత్రమో చెప్పండని వారిని కలుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లలో వేణుస్వామి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు. మరి ఈయన ట్రెండింగ్ లో ఉన్నారా? యూట్యూబ్ వీడియోల్లో వివాదస్పద కామెంట్లతో వైరల్ అయ్యారా తెలియదు. ఆయన చెప్పే జాతకాల్లో ఎన్ని నిజం అవుతాయో లేదా ఆయన శిష్యులు ఎంతమంది గొప్పవాళ్లు అయ్యారో మనకు తెలియదు కానీ.. ఆయన ఇంటర్వ్యూల్లో మాత్రం ప్రధాని మోదీ నుంచి మొదలు పెట్టి కార్పొరేటర్ దాక.. బిగ్ బీ నుంచి మొదలుపెట్టి రాకెట్ రాఘవ దాక అందరి జాతకాలు చెప్పానంటారు. మొన్నటికి మొన్న కేసీఆర్ గెలవకుంటే తాను జాతకాలు చెప్పడం మానేస్తా అంటూ సవాల్ విసిరారు. చివరకు ఏం జరిగిందో అందరికీ తెలుసు. కేసీఆర్  అపొజిషన్ లో కూర్చున్నా.. వేణుస్వామి మాత్రం యూట్యూబ్ ల్లో ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు.

    తాజాగా ఆయన గారు బాగా వైరల్ అయ్యే జాతకం ఒకటి చెప్పారు. మరి దాని రీచ్ ఎంతుంటుందో తెలియదు. మొత్తానికైతే బల్లగుద్ది మరీ చెప్పారు. తాను చెప్పింది వందశాతం జరుగుతుందని. రష్మిక, విజయదేవరకొండ మధ్య ఏదో ఉందని అందరికీ తెలుసు. వేణుస్వామి వీరిద్దరి గురించి చెబుతూ.. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకుంటారని, కానీ కొన్ని రోజుల తర్వాత విడాకులు తీసుకుంటారని బాంబు పేల్చారు. ఈ విషయాన్ని తాను స్వయంగా రష్మికకే చెప్పానని, ఈ విషయంలో రష్మిక తనతో గొడవ కూడా పెట్టుకుందని చెప్పుకొచ్చారు. మరి ఇందులో వాస్తవం ఎంతుందో వేణుస్వామికే తెలియాలి. విడాకుల దాక ఎందుకు వారు ఫస్ట్ పెళ్లి చేసుకోవాలిగా అని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...