30.3 C
India
Friday, July 19, 2024
More

  Vinukonda MLA : అభివృద్ధిని చూసే వైసీపీలోకి భారీగా చేరికలు.. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

  Date:

  Vinukonda MLA
  Vinukonda MLA

  Vinukonda MLA : మరో రెండు నెలల్లో ఎన్నికల జరుగబోతుండగా ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వైసీపీ ఇప్పటికే నాలుగు జాబితాలు ప్రకటించింది. నోటిఫికేషన్ నాటికి మొత్తం అభ్యర్థులను ప్రకటించే విధంగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారు. ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈక్రమంలో ఇతర పార్టీల నుంచి నాయకులు వైసీపీలో చేరుతున్నారు.

  పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం మారెళ్లవారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ  నాయకులు బత్తుల వెంకటేశ్, బత్తుల రామారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

  ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు  మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ప్రత్యర్థి పార్టీలు వణికిపోతున్నాయన్నారు.  వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కార్యకర్తలు, నాయకులు  వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ లోకి చేరడం సంతోషకరమన్నారు. ఎన్నికల నాటికి టీడీపీ నుంచి మరింత మంది పార్టీలో చేరబోతున్నారన్నారు.

  రాబోయే ఎన్నికల్లో రెండో సారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టుగా 175 సీట్లు వైసీపే గెలుస్తుందన్నారు. జగన్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ.. ఎన్నికల సమరశంఖం కూడా పూరించారన్నారు. సిద్ధం సభతో ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.

  Share post:

  More like this
  Related

  Windows : విండోస్  లోసాంకేతిక లోపాలు.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన సేవలు

  Windows Windows : జూలై 19 ఉదయం నుంచి బ్యాంకులతో సహా మైక్రోసాఫ్ట్...

  Darling Movie : మూవీ రివ్యూ : డార్లింగ్ హిట్టా.. ఫట్టా..?

  డైరెక్షన్ : అశ్విన్ రామ్ నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి సినిమాటోగ్రఫి: నరేష్ ఎడిటర్: ప్రదీప్...

  Gautam Gambhir : గౌతమ్ గంభీర్ చెప్పినట్లే చేస్తున్నాడా?

  Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు...

  Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. పది జిల్లాలకు రెడ్ అలర్ట్

  Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం, శనివారం భారీ నుంచి...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  AP CM Chandrababu : ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరీ అందజేసిన సీఎం, ఐటీ మినిస్టర్..

  AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు పంపిణీ వేడుకలా...

  Eluru District : వైసీపీ గెలుస్తుందని పందెం.. రూ.30 కోట్లు చెల్లించలేక ఆత్మహత్య

  Eluru District : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని సుమారు రూ.30...

  Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఊహించని పదవులు..

  Pawan Kalyan : ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ఫలితాలు...

  YSRCP : గెలిస్తే సక్రమం.. ఓడితే అక్రమం.. ఇది వైసీపీ తీర్పు 

  YSRCP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2019 లో అసెంబ్లీ ఎన్నికలు...