31.9 C
India
Monday, May 6, 2024
More

    Mumbai Indians : ‘ముంబై ఇండియన్స్’లో అసలు ఏం జరుగుతుంది?

    Date:

    Mumbai Indians
    Mumbai Indians

    Mumbai Indians : ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్). ప్రారంభించి 16 సీజన్లు పూర్తయ్యాయి. మరి కొన్ని రోజుల్లో 17వ సీజన్ షురూ కానుంది. ఈ క్రమంలో ఆటగాళ్ల ప్రాంచైజీల మార్పు కొత్త అంశాలకు తెరలేపుతుంది. ఆయా జట్ల నుంచి తమకు ఇష్టమైన ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటును ప్రాంచైజీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ తీసుకున్న ఓ నిర్ణయం వార్తల్లో నిలుస్తున్నది.

    అసలు ఏం జరిగింది
    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. ఈ జట్టు ఐదు సార్లు ఛాంపియన్ గా నిలవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్రను వెలకట్టలేం. ముంబై ఇండియన్స్ కేప్టెన్సీని రికీపాంటింగ్ నుంచి 2013లో అందుకున్న రోహిత్.. ఆ ఏడాదే మొదటి టైటిల్ అందించాడు. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020 సీజన్లలోనూ టైటిల్స్ తీసుకువచ్చాడు. ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ కు  ఇండియన్ టీమ్ పగ్గాలు కట్టబెట్టేలా చేసింది. టీమిండియా కెప్టెన్ గా కూడా రోహిత్ విజయవంతం అయ్యాడు. అతని కెప్టెన్సీలో రెండు సార్లు ఆసియా కప్ గెలిచింది. కానీ ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న లోటు అతన్ని వెంటాడుతుంది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ లో ఇండియా ఫైనల్ చేరినా, ఆసిస్ చేతిలో ఓడడంతో టైటిల్ ఆశ నెరవేరలేదు. ఈ క్రమంలో రోహిత్ ను కెప్టెన్సీ ముంబై తప్పించడం హాట్ టాపిక్ గా మారింది.

    రోహిత్ తప్పుకున్నాడా? తప్పించారా?
    ముంబై కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడానికి ఓ కారణమంటూ ప్రత్యేకంగా లేదనే చెప్పాలి. ఇప్పటికే ఆ ఫ్రాంచైజీ 5 టైటిల్స్ గెలిచింది. దీనికితోడు ఐదు టైటిళ్లు గెలిచి ధోనీ సరసన నిలిచాడు. ఇప్పటికే 36 ఏళ్లున్న రోహిత్.. వచ్చే సీజన్‌లో ఓ ప్లేయర్‌గానే ఆడనున్నాడు.  దీనికితోడు తన కెరీర్లో మిగిలిన సమయానికి పూర్తిగా ఇండియన్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికే కేటాయించనున్నాడు. కొత్త టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదలు కావడంతో టీమిండియాకు గెలుపులు ఎంతో ముఖ్యం. ఆ లెక్కన రోహిత్ కు భారం తగ్గడం ఇక నుంచి ఇండియన్ టీమ్ కు మంచే చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    ముదిరిన వివాదం
    రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తప్పించి హార్ధిక్ పాండ్యాను నియమించింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికావడమే కాకుండా,  ఆటగాళ్ల మధ్య వివాదానికి దారితీసింది. ఈ ప్రాంచైజీకి సుమారు 20 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పుడైతే రోహిత్ శర్మను తప్పించారో అప్పటి నుంచి ఏకంగా ఫాలోవర్ల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ఇన్ స్టా గ్రామ్ లో ముంబై కి 12.6 మిలియన్లకు ఫాలోవర్లు తగ్గిపోయారు. ఈ నిర్ణయం వ్యక్తిగత వైరానికి సైతం దారి తీసినట్లు తెలుస్తున్నది. ఒకప్పుడు రోహిత్ కెప్టెన్సీలో ముంబైకి ఆడిన హార్ధిక్ పాండ్యాను ఏకంగా అతన్ని కెప్టెన్ చేయడం ఇద్దరి మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. ఇన్ స్టా గ్రామ్ లో ఎప్పుడూ రోహిత్ శర్మను ఫాలో అయ్యే హార్ధిక్ ప్రస్తుతం అతన్ని అన్ ఫాలో కావడం చర్చకు దారితీసింది. చూడాలి మరి ఈ వివాదం ఎటు వైపు మళ్లుతుందో.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...