37.8 C
India
Monday, April 29, 2024
More

    ABN RK : జగన్ ను తిట్టి.. చెవిరెడ్డికి భయపడుతున్న ఏబీఎన్ ఆర్కే.. ఏంటి కారణం?

    Date:

    Abn rk mla chevireedy
    Abn rk mla chevireedy

    ABN RK చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి అంటే ఎల్లో మీడియా భయపడుతున్నదా.. ఏబీఎన్ ఆర్కే కూడా ఇందులో ఉన్నారా.. అంటే నిజమే అనిపిస్తున్నది. వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వంపై ఆంధ్రజ్యోతి పత్రిక విరుచుకుపడుతనూ ఉంటుంది. రాష్ర్టమంతటా ఇలా జగన్ జర్కారు చేస్తున్న అన్యాయాలపై జిల్లాల వారీగా కథనాలు ప్రచురిస్తూ ఉంటుంది. అయితే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి విష‌యంలో మాత్రం సాఫ్ట్ వైఖరి అవలంబిస్తున్నది.  ఆయనకు వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా ఆ పేపర్ లో కనిపించదు. మరోవైపు చెవిరెడ్డి ఎల్లో మీడియాను కొనేశారని తిరుపతి సర్కిళ్లలో టాక్ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా తిరుప‌తి రూర‌ల్ ప‌రిధిలోని పేరూరులో మండలాధ్యక్షుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి సొంత పార్టీ లోనే అసమ్మతి రాగం వినిపించింది. మోహిత్ రెడ్డి చెవిరెడ్డి పెద్దకొడుకు. రానున్న ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    ఇటీవల జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్యక్రమంలో భాగంగా మోహిత్‌రెడ్డిని కొంతమంది స్థానిక వైసీపీ నాయకులు నిలదీశారు. గ్రామంలో నాలుగేళ్లుగా డ్రైనేజీ స‌మ‌స్య పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇదే వార్తను ఈనాడు పేపర్ రాసింది. కానీ ఆర్కే ప‌త్రిక‌లో ఎక్కడా కనిపించలేదు. ఇదే ప‌త్రిక‌లో కృష్ణా జిల్లా ఉయ్యూరులో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్రభుత్వం కార్యక్రంలో భాగంగా పెన‌మ‌లూరు ఎమ్మెల్యే పార్థసారథిని టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తార‌ని లబ్ధిదారులు నిలదీసినట్లు ఫొటోతో కూడిన వార్త ప్రచురితమైంది.

    దీంతోపాటు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండ‌లం రామ‌చంద్రాపురంలో జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్యక్రమంలో జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు నిర‌స‌న సెగ త‌గిలిన‌ట్టు కూడా కథనం ప్రచురితమైంది. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడిని నిలదీసిన వార్త మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎల్లో మీడియాకు కూడా యాడ్స్ ఇస్తుంటారని సమాచారం. అందుకే ఆయన విషయంలో ఆంధ్రజ్యోతి మెతఖవైఖరి అవలంబిస్తున్నదని టాక్ . అయితే యాడ్స్ ఇస్తే చాలు.. వారేం చేసినా ఆర్కే పట్టించుకోరని చెవిరెడ్డి నిరూపించారని టాక్ నడుస్తున్నది. ఇది ఈ ఒక్కసారి మాత్రమే కాదు. చెవిరెడ్డి విషయంలో ప్రతిసారి ఆంధ్రజ్యోతి మెతఖ వైఖరి అవలంబిస్తున్నదని సమాచారం ఇటీవ‌ల చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలోఇసుక దందాపై పెద్ద ఎత్తున ర‌గ‌డ జ‌రిగింది.

    దీనిపై అసలు ఆంధ్రజ్యోతిలో కథనమే రాలేదు. వైసీపీకి సంబంధించిన వ్యవహారం ఇతర నియోజకవర్గాల్లో అయితే ఆంధ్రజ్యోతి బ్యానర్ కథనాలు రాసేది. ఇక చెవిరెడ్డి విషయం కాబట్టి అది తలదూర్చలేదు. అమ్ముడు పోయే పత్రిక ఉండ‌గా, కొనే చెవిరెడ్డి లాంటి వాళ్లు ఉండడంలో తప్పులేదని చర్చ కొనసాగుతున్నది. జగన్ పై ఆ పత్రిక చేస్తున్న దుష్ర్పచారాన్ని కూడా చెవిరెడ్డి తీసుకుంటే బాగుంటుదని అంతా అనుకుంటున్నారు. అయితే ఒక్క చెవిరెడ్డి విషయంలోనే ఏబీఎన్ అధినేత ఆర్కే ఎందుకు మెతకవైఖరి  అవలంబిస్తున్నారని మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, తలలు పట్టుకుంటున్నారట. తమకు కూడా అదేదో కిటుకు తెలిస్తే బాగుండని అనుకుంటున్నారట. ఎందుకంటే  ఆర్కే తన పత్రికలు ఎప్పడు ఏ నియోజకవర్గం మీద పడుతారో తెలియని పరిస్థితి ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రం ఇందులో మినహాయింపు ఉందని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో మరి వీరి మధ్య ఉన్న బంధం ఏంటో తెలియక అందరూ సతమతమవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..

    CM Jagan : నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

    Jagan Meets KCR : రాజకీయ సలహాల కోసమే కేసీఆర్ ను జగన్ కలుస్తున్నారా?

    Jagan Meets KCR : ఇవాళ షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారు....

    Sharmila Selective Leaks : ఆర్కేకు సెలెక్టివ్ లీకులు ఇస్తున్న షర్మిల.. అన్నకు చెక్ పెట్టేందుకేనా?

    Sharmila Selective Leaks : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ...

    AP Political Parties : కొత్త ఏడాది.. తాడోపేడో..చావోరేవో అంటున్న ఏపీ పార్టీలు

    AP Political Parties : ఏపీలోని రాజకీయ పార్టీలకు ఈ ఏడాది...