Meera Jasmine :
సినిమాల్లో పద్ధతిగా నటించిన మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ గ్లామర్ గా కనిపించేది. ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ ను పెంచుకుంటూ పోతూనే ఉంది. అందానికి పెట్టింది పేరు మీరా జాస్మిన్. ‘అమ్మాయి బాగుంది’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఫాలోయింగ్ ను పెంచుకుంది. తర్వాత వచ్చిన సినిమాలతో బాగా ఫేమస్ అయ్యింది. అప్పట్లో గ్లామర్ కు దూరంగా ఉన్న ఈ అమ్మడు వరుసగా ఆఫర్లు పోగొట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎంత అందం ప్రదర్శించిన పట్టించుకునే నిర్మాత, దర్శకుడు లేకపోవడంతో వెండితెరపై కనిపించడం లేదు.
రవితేజతో కలిసి చేసిన ‘భద్ర’లోని ఆమె రోల్ ఆమెకు బాగా గుర్తింపు తెచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది మీరా జాస్మిన్. అసలు అంతుపట్టని విధంగా ఒకేసారి వెండితెరకు దూరం అయ్యింది. అప్పట్లో ఆమెకు వింత వ్యాధి ఉందంటూ వార్తలు పుకార్లు పుట్టించాయి. కానీ అవేవీ లేవంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం గ్లామర్ డోస్ ను పెంచుతూ సోషల్ మీడియాలో పిక్ లను పోస్ట్ చేస్తూ కుర్రకారును తన నుంచి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది చిన్నది.
సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ‘విమానం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది మీరా జాస్మిన్. ఈ మూవీలో ఎయిర్ హోస్ట్రర్ గా కనిపించింది. ఈ బ్యూటీ ఇటీవల నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ తను సినిమాలకు గ్యాప్ ఇవ్వడంలో కారణాన్ని బయటపెట్టింది. గతంలో హీరోయిన్ గా రాణించినందుకు గర్వంగా ఉంది. ఇప్పటి నుంచి కెరీర్ ను మళ్లీ మొదలు పెట్టాలని అనుకుంటున్నా.. ఇంకా మెరుగ్గా నటించేందుకు మరింత కష్టపడతాను అంటుంది. విమానంలో నటిస్తుంటే తిరిగి కొత్తగా ప్రయాణం మొదలు పెట్టిన ఫీల్ కలుగుతుంది చెప్పుకచ్చింది మీరా జాస్మిన్.