
Piles Problems :ప్రతి జీవి ఆహారం తీసుకుంటుంది. కానీ అది దాన్ని పూర్తిగా అరిగించుకుంటుంది. మనిషి ఒక్కడే తాను తిన్న ఆహారం జీర్ణం కాకుండా చేసుకుంటాడు. దీంతో గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఏ జంతువు కూడా ఆస్పత్రికి వెళ్లదు. వైద్యం చేయించుకోదు. మనిషి అన్ని రోగాలు కొనితెచ్చుకుని నిత్యం ఆస్పత్రుల చుట్టు తిరుగుతుంటాడు. అడ్డమైన గోళీలు మింగుతుంటాడు. దీని వల్ల ఎన్నో అనర్థాలు తెచ్చుకుంటాడు.
మనం తినే ఆహారం బాగా నమిలితే జీర్ణ సమస్యలు రావు. కానీ కొందరు ఏదో మునిగిపోయినట్లు గబగబ తింటుంటారు. దీని వల్ల అజీర్తి చేస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కాకపోతే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. దీంతో అది తీవ్రమైతే అర్షమెలలకు దారి తీస్తుంది. దీనికి ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. మనం జాగ్రత్తగా ఉండకపోతే అలాంటి పరిణామాలు రావడం సహజం.
అర్షమొలలను(piles) తొలగించుకోవడానికి ఆయుర్వేదంలో ఓ చిట్కా ఉంది. దీంతో మొలలు ఇక జన్మలో రావు. దీనికి పసుపు, ఉల్లిపాయలు, ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఓ రెండు ఉల్లిపాయలు ముక్కలు చేసుకుని మెత్తగా మెక్సి పట్టుకోవాలి. అందులో ఓ అరచెంచా పసుపు, కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలుపుకుని పేస్టులా కలుపుకోవాలి. దాన్ని మొలలు ఉన్న చోట రాసుకుంటే ఇక మళ్లీ రావు.
ఇలా మనకు కలిగే సమస్యలకు ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలు ఉన్నాయి. మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలంటే మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో ఈ సమస్య నుంచి దూరం కావచ్చు. ఇలా మనం తినే ఆహారం కూడా మంచిది తీసుకుంటే ఫలితం బాగుంటుంది.