
Banana Check for Files problem : ప్రస్తుతం చాలా మందిలో మలబద్ధకం సమస్య ఏర్పడుతోంది. దీంతో ఫైల్స్ గా మారి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. ఫైల్స్ గా మారితే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా మలబద్ధకం సమస్య మనకు ఎంతో నష్టం కలిగిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్య నిబంధనలు పాటించడం లేదు. ఇష్టమొచ్చినట్లుగా తింటున్నారు. ఫలితంగా ఫైల్స్ ను దూరం చేస్తుంది.
అరటిపండులో పోషకాలు మెండు. ఫైల్స్ తగ్గించడానికి (Piles problem) ఇది ఉపయోగపడుతుంది. ఫైల్స్ కు ఫ్రెండ్లీ ఆహారంగా చూస్తారు. అందుకే ఇది ఫైల్స్ ను నివారిస్తుంది. దీంతో అరటిపండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కానీ వీటిని ఎప్పుడు తినాలి? ఎలా తినాలనేదాని మీద కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మనకు వ్యాధి నివారణ సాధ్యం అవుతుంది.
అరటిపండును అల్పాహారంలో తీసుకోకూడదు. ఏదైనా తిన్న తరువాత సాయంత్రం పూట తినాలి. స్నాక్స్ తిన్న తరువాత తినడం మంచిది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలం మెత్తగా చేసేందుకు దోహదపడుతుంది. ఫైల్స్ తీవ్రతను తగ్గిస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి.
అరటి కాయలు తింటే అజీర్తి సమస్య వస్తుంది. పూర్తిగా పండిన పండునే తినాలి. దీంతో ఫైల్స్ సమస్యకు చెక్ పెట్టినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో అరటి పండు వల్ల ఫైల్స్ సమస్యను పూర్తిగా నివారించుకోవచ్చు. దీనితో మన శరీరంలో ఉండే పలు రకాల సమస్యలను కూడా దూరం చేస్తాయి. ఇలా అరటిపండ్ల వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి.