37.8 C
India
Monday, April 29, 2024
More

    కేసీఆర్ ఎత్తుకు.. షిండే పైఎత్తు.. ఫ‌లించేనా..!

    Date:

    kcr-shinde
    kcr-shinde

    మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే తెలంగాణ‌పై ప్ర‌త్యేక న‌జ‌ర్ పెట్టారు. తెలంగాణ‌లో శివ‌సేన‌(షిండే) బ‌ల‌ప‌డ‌డంపై ఫోక‌స్ పెంచారు. అందుకోసం ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు క‌దులుతున్నారు. రానున్న ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో శివ‌సేన‌ను విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇందుకోసం శివ‌సేన తెలంగాణ ఇంఛార్జ్ బాధ్య‌త‌ల‌ను సుంకారి శివాజీకి అప్ప‌గించారు. శివాజీకి తెలంగాణ‌లో మంచి పేరుంది. ఆయ‌న ప‌బ్లిక్ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరాటం చేస్తార‌ని పేరు తెచ్చుకున్నారు. అందుకే తెలంగాణ‌లో శివ‌సేన విస్త‌ర‌ణ కోసం శివాజీని ఏరికోరి షిండే నియ‌మించు కున్న‌ట్లు స‌మాచారం.

    అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా..అస‌లు మ‌హా సీఎం ఇప్పుడెందుకు తెలంగాణ‌పై ఫోక‌స్ పెట్టార‌నే దానిపైనే ప్ర‌ధానంగా డిస్క‌ష‌న్ సాగుతోంది. ప్ర‌స్తుతానికి ఆయ‌న మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ..స్వంత పార్టీ స‌మ‌స్య‌ల‌నే తీర్చుకోలేక‌పోతున్నారు. శివ‌సేన ఉద్ద‌వ్ వ‌ర్గంతో పంచాదీ కొన‌సాగుతూనే ఉంది. బీజేపీ హ్యాండిచ్చిన మ‌హా స‌ర్కార్ కూలిపోవ‌డం,షిండే ప‌ద‌వి ఊష్ కాకి కావ‌డం ఖాయం. ఒక విధంగా చెప్పాలంటే షిండే సీఎం పోస్ట్‌లో ఉన్న‌ప్ప‌టికీ..ఆయ‌న ప‌ద‌వి దిన‌ దినం ప్రాణ‌గండం అన్న చంద‌నంగా ఉంది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మాత్రం తెలంగాణ‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించ‌డం విశేషం.

    కొంత కాలంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్‌ను మ‌హారాష్ట్ర‌లో విస్త‌రించాల‌ని భావిస్తున్నారు. అందుకోసం ఆయ‌న ఇప్ప‌టికే మూడు స‌భ‌ల‌ను కూడా పెట్టారు. మొద‌ట‌గా నాందేడ్‌లో పెట్టిన స‌భ స‌క్సెస్ కావ‌డంతో.. త‌ర్వాత కందాన్‌,ఔరంగాబాద్‌ల్లోనే మీటింగ్స్ పెట్టారు. ఈనేప‌థ్యంలోనే తెలంగాణ‌కు స‌రిహ‌ద్దున గ‌ల‌ జిల్లాల‌పై ప‌ట్టుకోసం బీఆర్ఎస్ శ‌క్తి వంచ‌న లేకుండా వ‌ర్క్ చేస్తోంది. సుమారు 51 సెగ్మెంట్ల‌లో త‌మ ప్ర‌భావాన్ని చూపించాల‌ని భావిస్తోంది. నాందేడ్‌,బీడ్‌,ఔరంగ‌బాద్‌,జాల్నా,ప‌ర్బ‌నీ వంటి జిల్లాల్లో భారాస బ‌లం పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టింది. ఇందుకోసం కేసీఆర్ అక్క‌డి నేత‌ల‌కు అవ‌స‌ర‌మైన ఆర్థిక‌,అంగ బ‌లాల‌న్నింటిని అందిస్తున్నారు.

    అయితే మ‌హారాష్ట్ర‌,తెలంగాణ స‌రిహ‌ద్దు ప్రాంతాల‌పై ప‌ట్టుకోసం బీఆర్ఎస్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు మ‌హా ముఖ్య‌మంత్రి ఏక్ నాథ్ షిండేకు టెన్ష‌న్ తెప్పిస్తున్నాయి. ఇప్ప‌టికే ఉన్న త‌ల‌నొప్పులు చాల‌వ‌న్న‌ట్లు కొత్త‌గా కేసీఆర్ వ్య‌వ‌హారం ఆయ‌న‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందంటా..! అందుకే కేసీఆర్ వ్యూహానికి ప్ర‌తి వ్యూహాన్ని ఏక్ నాథ్ షిండే సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో కేసీఆర్ వేలు పెట్టినందున‌..శివ‌సేన‌ను తెలంగాణ పాలిట్రిక్స్ లోకి ఏంట్రీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

    అందులో భాగంగానే తెలంగాణలో మంచి పేరున్న‌ నేత సుంకారి శివాజీకి రాష్ట్ర‌ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఆయ‌న‌కు కావాల్సిన అన్ని ర‌కాల స‌దుపాయాల‌ను ఏక్ నాథ్ స‌మ‌కూర్చుతున్నారు. దీంతో తెలంగాణ రాజ‌కీయాల్లోకి షిండే కొంచెం దూకుడుగా దూసుకువ‌చ్చేందుకే సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే షిండే చేసే ప్ర‌య‌త్నాలు ఎలా ఉన్నా..ఇప్ప‌టికే రాష్ట్రంలో చాలా పొలిటిక‌ల్ పార్టీలు యాక్టివ్‌గా ఉన్నాయి. వాట‌న్నింటిని త‌ల‌ద‌న్ని ఏక్‌నాథ్ కేసీఆర్‌ను నిలువ‌రించే ప‌రిస్థితి ఉంటుందా..? అనే అనుమానాల‌ను రాజ‌కీయ విశ్లేష‌కులు లెవ‌నెత్తుతున్నారు.

    Share post:

    More like this
    Related

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Devendra Fadnavis : రెండు పార్టీలను చీల్చి అధికారంలోకి తిరిగి వచ్చా.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం

    Devendra Fadnavis : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర...

    Raj Thackeray : ఎన్డీయే గూటికి రాజ్ థాకరే..!

    Raj Thackeray : లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో శరవేగంగా ఈక్వేషన్లు...

    KCR Political Strategy : ఎంఐఎంతో అజారుద్దీన్ కు చెక్.. కేసీఆర్ పొలిటికల్ స్ట్రాటజీ..

    KCR Political Strategy : తాజా పరిణామాలు ఎన్నికల్లో ఎంఐఎం భాగస్వామ్యాన్ని...

    Maharashtra : టెర్రరిస్ట్ అనుకొని చెంపచెళ్లు.. పోలీస్ అని తెలుసుకొని..

    Maharashtra :  ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగంగా  పోలీసులు మాక్ డ్రిల్...