
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారు లేరు..ఈమె సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుసగా సూపర్ హిట్స్ అందుకుని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచు కుంది.. మరి ఈమె వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈమె కూడా తల్లికి తగ్గ తనయగా గుర్తింపు పొందింది.. ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను కూడా అరబోయడంతో ఆరితేరింది.
ప్రెజెంట్ జాన్వీ బాలీవుడ్ లో బిజీగా ఉంటూనే సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఈమె చేతిలో ఇప్పుడు మంచి మంచి సినిమాలు ఉన్నాయి.. ఇక సౌత్ ఎంట్రీకి సిద్ధం అయ్యింది.. తల్లికి బాగా కలిసొచ్చిన నందమూరి వారసుడి తోనే తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది..
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ లో జాన్వీ కపూర్ నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటుంది.. ఈమె ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో లిప్ లాక్ ఇచ్చిన సందర్భాలు లేవు..
తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో లిప్ లాక్ గురించి మాట్లాడింది.. మీరు ఏ హీరోకు లిప్ లాక్ ఇస్తారు అని యాంకరమ్మ అడుగగా.. జాన్వీ ఖచ్చితంగా విజయ్ దేవరకొండతో లిప్ లాక్ చేస్తానంటు ఓపెన్ గా చెప్పింది.. గతంలో విజయ్ తో డేటింగ్ చేస్తానని తెలిపిన ఈమె ఇప్పుడు లిప్ లాక్ చేస్తానంటూ చెబుతుంది.. మరి విజయ్ ఈమెకు తన సినిమాలో ఎప్పుడు అవకాశం ఇస్తాడో చూడాలి..