34.5 C
India
Monday, May 6, 2024
More

    Tiger 3 vs Salaar : ‘సల్మాన్’ కు పోటీగా వస్తున్న ‘సలార్’.. పోటీలో నిలిచెదెవరు?

    Date:

    Tiger 3 vs Salaar :

    ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా విడుదలవుతుందంటే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా పోటీ నుంచి తప్పుకోవాల్సిందే. హిట్టు ప్లాపుతో సంబంధం లేకుండా మొదటి వారం ప్రభాస్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయం. ఇక సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే బాక్సాఫీసును దున్నేయడం ఖాయమని అందరికీ తెలిసిందే.

    ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’ సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అనివార్య కారణాలతో ‘సలార్’ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్రబృదం వెల్లడించింది. అయితే కొత్త రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీంతో ‘సలార్’ బాంబు తమ సినిమాలపై ఎక్కడ పడుతుందోనని నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.

    ‘సలార్’ పోస్ట్ పోన్ ఈ నెలలో రిలీజ్ అయిన కొత్త సినిమాలకు బాగా కలిసి వచ్చింది. అదే సమయంలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో మరికొన్ని సినిమాలకు ప్రాణసంకటంగా మారింది. అయితే సంక్రాంతి.. క్రిస్మస్.. దీపావళి వంటి ఫెస్టివల్ సీజన్లలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే క్రిస్మస్.. సంక్రాంతి మరీ ఆలస్యం అయిపోనుంది. దీంతో దీపావళికి ముందు ‘సలార్’ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

    అన్ని విధాలుగా ఆలోచించి నవంబర్ 24న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇలా అయితే పండుగ అడ్వాంటేజ్ ఉండదు. అలాగే ఇంకో వారానికి యానిమల్ లాంటి క్రేజ్ మూవీ వస్తోంది. టాలీవుడ్ కు దీపావళి పెద్దగా కలిసి రాకపోయినా నార్త్ ఇండియా.. తమిళనాడులో క్రేజ్ ఉండనుంది. లాంగ్ వికెండ్ కలిసి రానుండటంతో సలార్ ను ఆ సమయంలో విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

    ఈ టైంలోనే స‌ల్మాన్ ఖాన్ ‘టైగ‌ర్‌3’ రీలీజ్ షెడ్యూల్ అయింది. దీంతో ‘సల్మాన్’కు పోటీగా ‘సలార్’ ఎక్కడ దిగుతుందోననే టెన్షన్ ఆ సినిమా నిర్మాతలను వెంటాడుతోంది. టైగ‌ర్ 3 వాయిదా ప‌డుతుంద‌నే సంకేతాలు లేకున్నా ‘సలార్’ పోటీకి సై అంటుందంటే నిర్మాతలు ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారో అర్థమవుతోంది. సల్మాన్ సినిమా టైంలో ‘సలార్’ ఫిక్స్ అయితే మాత్రం ‘టైగర్3’కి కష్టంగా మారనుంది. అసలే సల్మాన్ హిట్టు కొట్టి చాలా రోజులైంది. ఈ నేపథ్యంలో రేసు నుంచి ఎవరు తప్పుకుంటారనే ఆసక్తి నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...