పాకిస్థాన్ ఉగ్రమూకలు భారత్ వాణిజ్య రాజధాని ముంబై పై దాడికి పాల్పడిన ఘటనకు నేటికి 14 ఏళ్ళు. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం పాకిస్థాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులు ముంబై లోకి నేరుగా ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. ఒక్కసారిగా యావత్ ప్రపంచాన్ని షాక్ అయ్యేలా చేసారు. అయితే వెంటనే తేరుకున్న భారత్ సుశిక్షితులైన సైనికులను రంగంలోకి దించగలిగింది. అయితే మీడియాలో మన సైన్యం ఏ ఏ దారులలో వస్తోందో …… ఎలాంటి ఆయుధాలతో వస్తుందో తెలుసుకున్న పాక్ ఉగ్రమూకలు తాజ్ , ట్రైడెంట్ లలో ఉన్న టెర్రరిస్టులకు సూచనలు ఇవ్వడంతో భారత్ పెద్ద ఎత్తున సైనికులను నష్టపోయింది.
అయినప్పటికీ మొక్కవోని దీక్షతో ముందగుడే వేశారు. భయాన్ని పక్కన పెట్టి నా దేశం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దమే ……. అంటూ తమ ప్రాణాలను లెక్కచేయకుండా శత్రువులకు చీల్చి చెండాడారు. భారతజాతి పరువు నిలబెట్టారు. మా దేశాన్ని టచ్ చేసేంత దమ్ము మీకు లేదురా ? అంటూ సింహగర్జన చేసారు భారత సైనికులు.
అరాచకవాదులకు , వాళ్లకు అండగా నిలిచిన వాళ్లకు భారత్ సత్తా ఏంటో చాటిచెప్పారు. దేశ కీర్తి పతాకను ఎగురవేశారు.ఆనాటి ఘటనలో వందలాది మంది చనిపోగా అదేస్థాయిలో క్షతగాత్రులయ్యారు. ఇలాంటి సంఘటనలకు ఆత్మవిశ్వాసం కోల్పోయేదే లేదని పాక్ కు గట్టి గుణపాఠం చెప్పారు భారత సైనికులు.