కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాను నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్ కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. అయితే ఆర్ ఆర్ ఆర్ లో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకు ముగ్దుడై ఎన్టీఆర్ ని ఆహ్వానించారు తప్ప అందులో రాజకీయం లేదని కుండబద్దలు కొట్టాడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యకుడు బండి సంజయ్.
రాత్రి 10:30 నిమిషాల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని నోవాటెల్ హోటల్ లో అమిత్ షాను కలిశారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేసారు. కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడారు. అనంతరం శంషాబాద్ నుండి వెళ్లిపోయారు ఎన్టీఆర్. సుమారుగా 20 నిమిషాల పాటు ఎన్టీఆర్ – అమిత్ షా చర్చించారు. దాంతో తప్పకుండా రాజకీయాలను గురించి చర్చించి ఉంటారని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
Breaking News