
రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది ఓ సంఘటన. ఇంతకీ తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్న ఆ సంఘటన ఏంటో తెలుసా……. కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ను స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కలవడం. ఈరోజు మునుగోడులో అమిత్ షా భారీ బహిరంగ సభ ఉన్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు మునుగోడులో బహిరంగ సభ అయ్యాక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకోనున్నారు అమిత్ షా. అయితే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని హోటల్ లో కొద్దిసేపు అమిత్ షా తో సమావేశం కానున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాలలో కలకలం సృష్టిస్తోంది. ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు.
కానీ చాలాకాలంగా తెలుగుదేశం పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. అయితే తెరవెనుక ఏదో పెద్ద మతలబు జరిగి ఉంటుందని అందుకే ఎన్టీఆర్ అమిత్ షా తో భేటీ అవుతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ బీజేపీ కి మద్దతుగా నిలిస్తే తెలంగాణ రాజకీయాలు సరికొత్త అంశాన్ని సంతరించుకుంటాయి. ఇది ఖచ్చితంగా కేసీఆర్ కు గొడ్డలి పెట్టు అనే చెప్పాలి.