ఇకపై దుబాయ్ లో భారతీయులు అడుగు పెట్టాలంటే ఇంటి పేరుతో సహా పాస్ పోర్ట్ లో ఉండాలి. అలా లేకుంటే మాత్రం ఇకపై దుబాయ్ వెళ్ళలేరు సుమా ! ఈనెల 21 నుండి దుబాయ్ తన రూల్స్ ను మార్చింది. ఇంతకుముందు వరకు కూడా దుబాయ్ వెళ్లే వ్యక్తి ఇంటి పేరు లేకున్నా దుబాయ్ లో అడుగు పెట్టనిచ్చారు.
కానీ ఇక నుండి దుబాయ్ లో అడుగు పెట్టాలంటే మాత్రం తప్పనిసరిగా పాస్ పోర్ట్ లో ఇంటి పేరుతో సహా ఉండాల్సిందే. గతంలో చాలామందికి ఇంటి పేరు లేకుండానే పాస్ పోర్ట్ లు ఇచ్చారు. అలాంటి వాళ్ళు అందరు కూడా ఆయా పాస్ పోర్ట్ లలో ఇంటి పేరు అలాగే చివరి పేరు కూడా జత చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది దుబాయ్ ప్రభుత్వం.