కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కలకలం సృష్టించిన సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. ఇంతకీ ఆజాద్ పెట్టిన కొత్త రాజకీయ పార్టీ ఏంటో తెలుసా …….” డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ”. పార్టీ పేరు కోసం 1500 రకాల పేర్లను పరిశీలించాం. చివరకు ” డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరును ఫైనల్ చేశామంటూ మీడియా సమావేశంలో తెలిపారు ఆజాద్.
కాశ్మీర్ ప్రజల సంక్షేమం , అభివృద్ధి తమ ఎజెండా అని , ప్రస్తుతం కశ్మీర్ వరకు మాత్రమే మా పార్టీ పరిమితం అవుతుందని , ఆ తర్వాత దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరిస్తామని ఆజాద్ ప్రకటించారు . త్వరలోనే జమ్మూ – కాశ్మీర్ లకు ఎన్నికలు రానున్నందున తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసి రాహుల్ గాంధీ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.