
భారత్ – అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు పడుతున్నాయి. ప్రపంచ మానవాళి మనుగడ ప్రశ్నార్ధకమౌతున్న ఈరోజుల్లో భారతదేశంతో కలిసి శాంతి సౌబ్రాతృత్వం కోసం పనిచేస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
అమెరికా నుండి భారత్ 200 బోయింగ్ విమానాల కొనుగోలుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ తో బలమైన మైత్రి కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. 200 బోయింగ్ విమానాల కొనుగోలు ద్వారా అమెరికాలోని 44 రాష్ట్రాలకు చెందిన 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భారత్ నిర్ణయం వల్ల ఉభయ దేశాలకు మంచి జరుగుతుందంటూ మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు జో బైడెన్.