ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు ముగ్దుడై అమిత్ షా ఎన్టీఆర్ ని పిలిపించుకున్నారు ……. అభినందించారు అంటూ బీజేపీ శ్రేణులు చెబుతున్నప్పటికీ అది మాత్రం వాస్తవం కాదని తెలుస్తోంది ఎందుకంటే ….. దీని వెనుక పెద్ద రాజకీయమే ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించాడు. అలాగే చరణ్ నటనకు కూడా ప్రేక్షకులు ముగ్దులయ్యారు.
పైగా అల్లూరి సీతారామరాజు గెటప్ లో అద్భుతంగా ఉన్నాడు చరణ్. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కంటే చరణ్ పాత్రకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. అంతేకాదు దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా నటించాడు చరణ్. ఇక ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించాడు. తమ గూడెం కు చెందిన అమ్మాయిని బ్రిటీష్ వాళ్ళు తీసుకెళితే ఆ అమ్మాయిని కాపాడటానికి ఎన్టీఆర్ వెళ్తాడు.
ఇక ఇలాంటి గొప్ప సినిమాని తీసింది దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ చిత్రం చూసే అమిత్ షా ఎన్టీఆర్ ని పిలిస్తే తప్పకుండా దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళిని అలాగే హీరో చరణ్ ని కూడా ఆహ్వానించాలి. కానీ అలా జరగలేదు. అంటే తప్పకుండా ఎన్టీఆర్ ని బీజేపీ లోకి ఆహ్వానించడానికి మాత్రమే అమిత్ షా పిలిచాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మరో ఏడాదిన్నర కూడా లేదు ఎన్నికలకు. దాంతో ఎన్టీఆర్ సేవలు వినియోగించుకోవడానికే ఇలా చేసాడని , అమిత్ షా మాస్టర్ ప్లాన్ లో భాగంగానే ఈ భేటీ అని అర్ధం అవుతోంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా 2024 లో ఎన్నికలు రానున్నాయి. దాంతో ఎన్టీఆర్ బీజేపీ కి మద్దతుగా నిలిస్తే తప్పకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి లాభం జరుగుతుందని , ఏపీ లో అధికారంలోకి రాకపోయినా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందని , ఇక తెలంగాణలో తప్పకుండా అధికారం చేపట్టొచ్చని భావిస్తున్నారట. అందుకే ఎన్టీఆర్ తో భేటీ అయినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
Breaking News