
ఎన్టీఆర్ ని తమ బుట్టలో వేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. తమకు ఉపయోగపడతారు అనుకునే వాళ్ళను ఎలాగోలా తమ వశం చేసుకుంటున్నారు మోడీ – షా ద్వయం. అందులో భాగంగానే ఎన్టీఆర్ ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇటీవల ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించారు దాంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు ఈసారి ఎన్టీఆర్ ని వరించడం ఖాయమని తెలుస్తోంది. ఎలాగూ ఎన్టీఆర్ అద్భుత ప్రదర్శన చేసాడు కాబట్టి తమ మద్దతు కూడా ఉంటే అప్పుడు ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడు అవార్డు రావడం ఖాయమని , తద్వారా ఎన్టీఆర్ బీజేపీ కి ఉపయోగ పడతారని భావిస్తోంది బీజేపీ.
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దాంతో ఎన్టీఆర్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటుగా కమ్మ సామాజిక వర్గం కూడా తెలుగు రాష్ట్రాలలి బీజేపీకి అండగా నిలుస్తుందని లెక్కలు వేస్తున్నారట. అంతేకాదు పత్రికాధిపతి రామోజీరావు ని కలవడంలో కూడా అదే ఆంతర్యం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ కి గతకొంత కాలంగా కమ్మ సామాజిక వర్గం దూరంగా ఉంది. వాళ్ళను ప్రసన్నం చేసుకునే పనిలో భాగమే ఈ భేటీలు అని తెలుస్తోంది.