అక్టోబర్ నెలలో మొత్తం 31 రోజులు ఉండగా అందులో 21 రోజుల పాటు బ్యాంక్ లకు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 1 నుండి 31 వ తారీఖు వరకు మొత్తంగా 21 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. అయితే మొత్తం 21 రోజులు వరుసగా అది కూడా అన్ని రాష్ట్రాల్లో సెలవులు ఉండవు సుమా ! ఎందుకంటే భారతదేశం విభిన్న మతాలు , విభిన్న సంస్కృతుల సమ్మేళనం కాబట్టి ఆయా రాష్ట్రాలలో సెలవులు కొనసాగనున్నాయి కానీ మొత్తంగా 21 రోజుల పాటు అన్ని రాష్ట్రాలలో కాదు.
ఆయా రాష్ట్రాలలో ఆయా రాష్ట్రానికి చెందిన సంస్కృతీ ఆధారంగా కొన్ని రకాల పండగలు ఉంటాయి. దాంతో ఆయా రాష్ట్రాలలో మాత్రమే సెలవులు ఉండనున్నాయి. ఉదాహరణకు బతుకమ్మ పండగ. ఈ పండగ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతుంది. దాంతో తెలంగాణలో కాస్త ఎక్కువ సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అలాగే ఆయా రోజులలో బ్యాంకింగ్ రంగం పనిచేయదు. అమ్మో ….. ఇన్ని రోజులు సెలవులా ? అని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే …… ఆన్ లైన్ సేవలు యధాతదంగా కొనసాగుతాయి. కాకపోతే నేరుగా బ్యాంక్ లో డబ్బులు వేయాలన్నా , తీయాలన్నా కష్టం సుమీ !