
బీజేపీ నేత సోనాలి ఫోగట్ ని దారుణంగా హత్య చేసినట్లు ఎట్టకేలకు గోవా డీజేపీ తెలిపారు. మొదట సోనాలి ఫోగట్ గుండెపోటుతో మరణించిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. అయితే సోనాలి కుటుంబ సభ్యులు తీవ్ర మైన ఆరోపణలు చేయడంతో మళ్ళీ డాక్టర్లు సోనాలి మృతదేహాన్ని పరిశీలించగా ఒంటిపై గాయాలు ఉండటంతో ఆమెది హత్యగా నిర్దారించారు.
సోనాలి ఫోగట్ కు గతకొంత కాలంగా ఇద్దరు వ్యక్తులు సుధీర్ సంగ్వాన్ , సుక్వీందర్ వాసీ లు సోనాలీ కి మత్తు మందులు ఇచ్చి అత్యాచారం చేస్తున్నారని , అత్యాచారం చేసిన సమయంలో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసారని , దాంతో సోనాలి వాళ్ళ చేతిలో బందీ అయ్యిందని దాన్ని అలుసుగా తీసుకొని పలుమార్లు అత్యాచారం చేస్తూ పెద్ద ఎత్తున ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
దాంతో నిందితులను ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు గోవా పోలీసులు. అయితే వాళ్ళు ఇలా అందుకు చేసారు అన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదని , వాళ్ళను త్వరలోనే విచారించి అసలు విషయాలను బయటకు రాబడతామని అంటున్నారు గోవా పోలీసులు. సోనాలి ఫోగట్ దగ్గర పనిచేస్తున్న మనుషులే ఇంతటి దారుణానికి పాల్పడితే ఈ విషయం బయటకు పొక్కకపోవడం పెను సంచలనం సృష్టిస్తోంది.