39.2 C
India
Saturday, April 27, 2024
More

    ఉక్రెయిన్ కు భారీగా యుద్ధ సామగ్రి : నాటో

    Date:

    nato
    nato
    రష్యా యుద్ధాకాండను అడ్డుకునేందుకు పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నాటో కూటమి ఉక్రెయిన్ కు భారీగా సైనిక, ఆయుధ సాయం చేస్తూ వస్తోంది. ఉక్రెయిన్ కు ఇచ్చిన హామీ మేరకు 98 శాతం సాయుధ వాహనాలు, యుద్ధ సామగ్రి అందించినట్లు నాటో వెళ్లడించింది. చైనా అధ్యక్షుడితో ఉక్రెయిన్ అధ్యక్షుడు చర్చలు జరిపిన మరుసటి రోజునే ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    దాదాపు 1500 సాయుధ వాహనాలు, 230 ట్యాంకులు, భారీగా మందుగుండు సామగ్రి ఉక్రెయిన్ కు అందించినట్లు ఇప్పటికే నాటో స్పష్టం చేసింది. తొమ్మిది మంది ఉక్రెయిన్ బ్రిగెడ్లకు శిక్షణ కూడా ఇచ్చామని నాటో తెలిపింది. 30వేలకు పైగా సైనికులతో ఒక్కో బ్రిగేడ్ రూపొందుతుందని స్పష్టం చేసింది. రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని నాటో సెక్రటరీ జనరల్ జేన్స్ స్టోల్బెన్ బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్ ను మరింత బలోపేతం చేసేందుకు 31 దేశాలతో కూడిన నాటో కూటమి శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు.

    ఇక చైనా-ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య జరిగిన చర్చలపై రష్యా తనదైన శైలిలో స్పందించింది. ఈ సంభాషణతో యుద్ధం ముగుస్తుందా..? అన్న ప్రశ్నకు ఉక్రెయిన్ సంక్షోబానికి ముగింపు పలకడంతో పాటు రష్యా తన లక్ష్యాలను సాధించే దిశగా ఎటువంటి ప్రయత్నాన్ని అయినా స్వాగతిస్తామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్ చెప్పారు. అయితే చైనా-ఉక్రెయిన్ మధ్య జరిగిన చర్చలు మాత్రం వారి ద్వైపాక్షిక చర్చలేనని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    russia : ఈ నెమలి గడియారం చూడడానికి రెండు కళ్లు చాలవు

    russia ఇదో అద్భుతమైన వాచ్.. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ మ్యూజియంలో...

    Naatu Naatu Steps : నాటు నాటు స్టెప్పులతో అదరగొట్టిన సైనికులు.. వైరల్ వీడియో..

    Naatu Naatu Steps : దర్శకధీరుడు తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా...

    Shark swallowed : తండ్రి కళ్ళ ముందే కుమారుడిని మింగేసిన సొరచేప… వైరల్ వీడియో..

    Shark swallowed : ఓ మనిషిని సొర చేప మింగిన వీడియో...

    Obama : మా దేశంలోకి ఒబామాతో పాటు 500 మందికి నో ఎంట్రీ.. ప్రకటించిన రష్యా..

    Obama : రష్యా-అమెరికా మధ్య వార్ కొనసాగుతూనే ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధ...