
మనలో చాలా మందికి మద్యం అలవాటు ఉంటుంది. అందులో బీరంటే అందరికి ఇష్టమే. ఎండాకాలంలో చల్లగా ఉంటుందని బీర్లు తాగేందుకే మొగ్గుచూపుతారు. ప్రభుత్వానికి కూడా ఆదాయం భారీగా వస్తుంది. దీంతో మద్యపానం ఓ వ్యాపారంలా చేస్తోంది. బీరు తాగేటప్పుడు స్టఫ్ కోసం చాలా మంది కిక్కు ఇచ్చే పదార్థాలే తీసుకుంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. బీరు తాగేటప్పుడు ఏవి తినకూడదో తెలుసా.
బీరు తాగేటప్పుడు తాగిన తరువాత రెండు గంటల వరకు కూడా కొన్ని పదార్థాలు తీసుకోకూడదు. బీరు తాగిన రెండు గంటల వరకు బ్రెడ్ ఉత్పత్తులు తినకూడదు. దీంతో జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. అందుకే బ్రెడ్ తీసుకోవడం అంత సురక్షితం కాదని తెలుసుకోవాలి.
బీరు తాగే సమయంలో స్వీట్లు కూడా తినకూడదు. ఒకవేళ తింటే అనారోగ్యం దరి చేరడం ఖాయం. బీరు తాగిన తరువాత రెండు గంటల వరకు స్వీట్లు తినడం అంత మంచిది కాదు. వీటికి దరంగా ఉండటమే ఆరోగ్యం. మన శరీరానికి హాని కలిగించే వాటిని దూరం చేసుకోవడమే ఉత్తమం.
బీరుతో పాటు ఉప్పు శనగలు, వేరు శనగలు తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. ఇలాంటివి తింటే శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురు కావచ్చు. బీరు తాగేటప్పుడు మసాలా దినుసులు కూడా తీసుకోవద్దు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తే అవకాశం ఉంటుంది. కడుపులో నొప్పి వచ్చే సూచనలుంటాయి.