Thaman పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రేక్షకులకు పూనకమే. ఆయన సినిమా వస్తుందంటే అందరికి ఎంతో ఇష్టం. దీంతో త్వరలో వచ్చే బ్రో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు చూడాలనే ఆతృత అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో జులై 28న వచ్చే బ్రో సినిమాను విజయవంతం చేసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు.
పవన్ కల్యాణ్ సినిమాకు థమన్ సంగీతం అంటే ఇక మామూలుగా ఉండదు. కానీ ఈ సినిమాకు సరైన సంగీతం కొట్టలేదని ప్రేక్షకులు నిట్టూరుస్తున్నారు. ఈ ట్రైలర్ కట్ కోసం అంతా సిద్ధమవుతున్నా సంగీతం అందరిని నిరుత్సాహపరచింది. పవన్ డబ్బింగ్ చెప్పడం పూర్తయితే ట్రైలర్ వండర్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. థమన్ సంగీతం ఉర్రూతలూగించాల్సి ఉన్నా చప్పటి సంగీతం ఏం చేస్తుందో అని తెలియడం లేదు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్నాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక హైదరాబాద్ చేరుకుని డబ్బింగ్ చెబితే ట్రైలర్ విడుదల అవుతుంది. చిత్రానికి డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేయనున్నాడు. ఈ నెల 22న ట్రైలర్ విడుదల చేయనున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రో సినిమా ట్రైలర్ పై అందరికి ఉత్సాహం కలుగుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో సినిమా సంచలనాలు క్రియేట్ చేయబోతోందని అంటున్నారు. వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ కూడా ఇలాగే విడుదల చేశారు. దీంతో బ్రో సినిమా అంచనాలకు మించిపోతోంది. ఎక్కడ లేని హైప్ క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారు. బ్రో లో తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.