అక్కినేని నాగ చైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”కస్టడీ”.. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుండి భారీగా అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.. వెంకట్ ప్రభు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు..
తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న గ్రాండ్ గా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది.. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.. దీంతో కలెక్షన్స్ మీద చాలా ప్రభావం చూపించింది.. మొదటి రోజు కాస్త పర్వాలేదు అనిపించినా రెండవ రోజు మాత్రం దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి అని తెలుస్తుంది..
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరు నిర్మించారు.. అరవింద స్వామి, ప్రియమణి వంటి వారు కీలక పాత్రల్లో నటించగా ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 24.05 కోట్ల బిజినెస్ జరుపుకుంది..
రెండవ రోజు ఎంత వచ్చాయంటే.. ఈ సినిమా వీకెండ్ అయిన కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేక పోయింది.. రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.20 కోట్లు షేర్ రాబట్టగా ప్రపంచ వ్యాప్తంగా 1.50 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టింది.. దీంతో ఈ సినిమాకు వీకెండ్ కూడా కలిసి రావడం లేదు అనే చెప్పాలి.. చూడాలి ఆదివారం అయిన డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుందో లేదో.