
హాట్ యాంకర్ అనసూయ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది. ఇంతకీ ఆమె చేసింది ఏంటో తెలుసా …….. తెలంగాణ ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ని రీ ట్వీట్ చేయడమే ! గుజరాత్ లో అత్యాచారానికి పాల్పడిన వాళ్లకు బెయిల్ మంజూరు చేసారని , కానీ మా తెలంగాణలో శిక్షించామని కేటీఆర్ ట్వీట్ చేయగా అనసూయ ఆ ట్వీట్ ని రీ ట్వీట్ చేసింది.
ఇదే అనసూయని విమర్శల జడివానలో కొట్టుకుపోయేలా చేసింది. ఇక ఈ రీ ట్వీట్ చూసిన నెటిజన్లు అనసూయ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ లో జరిగిన దాన్ని తప్పు పడుతున్నావ్ బాగానే ఉంది మరి హైదరాబాద్ లో ఓ మైనర్ పై అత్యాచారం జరిగితే కనీసం ఎలాంటి స్పందన లేదు. మరి అప్పుడేమయింది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
దాంతో నా ట్వీట్ ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. నా ట్వీట్ ఎవరినీ ప్రమోట్ చేయడానికి కాదని సెలవిస్తోంది. ఇక ఇటీవలే ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ సినిమా రంగం గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడింది. ఇక్కడ మహిళలకు , హీరోయిన్ లకు ఎలాంటి గౌరవం లేదని,ఇక్కడ వాళ్ళు గిల్లితే గిల్లించుకోవాలి అంతేకాని ప్రశ్నలు వేయొద్దని అసహనం వ్యక్తం చేసింది. పలు చిత్రాల్లో ఈ భామ నటిస్తోంది కానీ అంతగా విజయాలు మాత్రం దక్కడం లేదు పాపం.