అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందాలని చూసే విదేశీయులు చాలా మందే ఉన్నారు. వివిధ దేశాలకు చెందిన వాళ్ళు గ్రీన్ కార్డ్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇందులో పోటీ పడుతున్న వాళ్లలో ఎక్కువమంది భారతీయులు, అందునా మన తెలుగువాళ్లు అధికంగా ఉన్నారు. అమెరికాలో గ్రీన్ కార్డ్ సాద్జిస్తే అక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే వీలు ఉండటంతో ఈ పోటీ ఎక్కువయ్యింది.
అయితే గతకొంత కాలంగా గ్రీన్ కార్డ్ కేటాయింపు లలో అమెజాన్ కు అమెరికా ప్రభుత్వానికి సమన్వయం కుదరడం లేదు. దాంతో గత ఏడాది లక్ష గ్రీన్ కార్డులను ఎవరికీ కేటాయించలేకపోయారు. అందుకే ఈ ఏడాది అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అమెజాన్ అమెరికా ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులను నిరుపయోగం చేయకూడదని, వీసాల ఆధారంగా ఆయా సంస్థల తరపున అమెరికాలో పనిచేసే వాళ్లకు గ్రీన్ కార్డులను ఇవ్వాలని , ఇలా చేయడం ద్వారా అమెరికాకు ఆర్ధికంగా మరింతగా లాభసాటిగా ఉంటుందని అమెజాన్ సంస్థ అమెరికా ప్రభుత్వాన్ని కోరుతోంది.