అగ్రరాజ్యం అమెరికాలో సైతం గణపతి ఉత్సవాలు జరుగుతాయన్న విషయం తెలిసిందే. అమెరికాలో ఉండే భారతీయులు అందునా ప్రవాసాంధ్రులు అత్యంత భక్తి శ్రద్దలతో గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. తాజాగా న్యూయార్క్ ఎడిసన్ లో గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం కూడా అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు , మహిళలు , వృద్దులు , యువత అనే తేడా లేకుండా అందరు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫోటోలకు ఉత్సాహంగా ఫోజిచ్చారు. గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేసారు.
ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్