
అమెరికాలో H1B వీసాలతో పని చేస్తున్న భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. H1B వీసాలతో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు , తమ ఉద్యోగాన్ని కోల్పోయినట్లైతే 60 రోజుల్లో మరో కొత్త ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. లేకపోతే అమెరికా వదిలిపెట్టి తమతమ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అమెరికాలో ఉద్యోగం కోల్పోతున్న వాళ్లలో అత్యధికులు భారతీయులు కావడం గమనార్హం.
ఉద్యోగం నుండి తొలగించిన సంస్థ తొలగించబడిన వాళ్లకు సహాయకారిగా ఉండాలి. కానీ కొన్ని సంస్థలు మాత్రం ఆ ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ వాస్తవంలో మాత్రం మరోలా ఉందట. మేమైతే తొలగించాం ….. ఇక మీ చావు మీరు చావండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. దాంతో ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులు ఆందోళనకు గురవుతున్నారు.
60 రోజుల్లోనే కొత్త ఉద్యోగం పొందాల్సి ఉండటంతో …… మరింత ఆందోళనకు గురవుతున్నారట. అయితే గ్రేడ్ ల వారీగా చూసినప్పుడు కొంతమందికి మాత్రం 60 రోజులకంటే కాస్త ఎక్కువ గడువును ఇచ్చే అవకాశం ఉందట. అలాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా కొత్త ఉద్యోగం పొందగలం అనే ధీమాతో ఉన్నారట.