
తెలుగువాళ్ళకు అందునా హిందువులకు ప్రీతికరమైన మాసం ” కార్తీకమాసం ”. ఎందుకంటే పరమ శివుడికి పరమ పవిత్రమైన మాసం …… ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి. అందుకే కార్తీక మాసంలో పరమశివుడిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఇక ఈ సంప్రదాయం మన దేశంలోనే కాకుండా దేశం కానీ దేశంలో ఉంటున్న వాళ్ళు సైతం ఆచరిస్తుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ కార్తీకమాసంలో వనభోజనాలు చేస్తూ పరమ శివుడ్ని తమ శక్తి కొలది కొలుస్తుంటారు. తాజాగా దుబాయ్ లో కూడా కార్తీక మాస వనభోజనాలు జరిగాయి. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున తెలుగువాళ్లు పాల్గొనడం విశేషం. రస్ అల్ ఖైమా లోని సువిశాలమైన పార్క్ లో ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు తరంగిణి అధ్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేష్ , ఉపాధ్యక్షులు ఎంవీఎస్ కె మోహన్ , కార్యదర్శి కోకా సత్యానంద కోశాధికారి చామర్తి రాజేష్ , ప్రసాద్ , తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు దినేష్ , మసియిద్దీన్ , వివేకానంద తదితరులు పాల్గొన్నారు.