మే 14 న కాలిఫోర్నియాలో మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్. కాలిఫోర్నియాలోని మిల్ఫీటాస్ నగరంలో ఈ వేడుకలు జరుగనున్నాయి. మదర్స్ డే వేడుకలకు శాన్ ఫ్రాన్సిస్కో ఇండియా కాన్సులేట్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. టాలీవుడ్ గాయనీ గాయకులు వేణు శ్రీరంగం , సుమంగళి పాటలను ఆలపించనున్నారు.