ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా ) సరికొత్తగా సమాజ సేవకు నడుం బిగించింది. పలు సేవా కార్యక్రమాలతో , సాంస్కృతిక కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసిన తానా తాజాగా మరో అద్భుత సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 2022 డిసెంబర్ 2 నుండి 2023 జనవరి 2 వరకు మొత్తంగా నెల రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ” తానా చైతన్య స్రవంతి ” పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనుంది.
20 కి పైగా క్యాన్సర్ క్యాంపులు , 30 కి పైగా ఐ క్యాంపులు , 10 కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే స్కాలర్ షిప్ ల రూపంలో మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నారు. 2500 మంది రైతులకు రైతు రక్షణ పరికరాలను , 500 కు పైగా వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిఈ చేయనున్నారు. పిల్లలకు క్రీడా పరికరాలు , సైకిళ్ళు , వీల్ చైర్ లను కూడా అందించనున్నారు. ఈకార్యక్రమంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి , తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ , తానా స్రవంతి కో- ఆర్డినేటర్ సునీల్ లతో పాటుగా పలువురు తానా సభ్యులు పాల్గొననున్నారు.