
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ పేలింది. ఇక్కడ తుపాకీ మోతలు సర్వసాధారమనే విషయం తెలిసిందే. టేనస్సీ స్టేట్ రాజధాని నాష్ విల్లేలోని ఓ ప్రయివేట్ ఎలిమెంటరీ స్కూల్ లో ఈ దారుణ సంఘటన జరిగింది. ఓ మహిళ జరిపిన కాల్పుల్లో ఆరుగురు పిల్లలు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం రోజున జరిగింది.
నాష్ విల్లేకు చెందిన 28 సంవత్సరాల ఆడ్రీ హేల్ రెండు రైఫిల్స్ , ఒక హ్యాండ్ గన్ తో స్కూల్ లోకి సైడ్ డోర్ నుండి ఎంటర్ అయ్యింది. స్కూల్ లోకి ఎంటర్ అవ్వడమే ఆలస్యం కాల్పులకు తెగబడింది. అకస్మాత్తుగా కాల్పులు చోటు చేసుకోవడంతో పిల్లలు , స్కూల్ సిబ్బంది షాకయ్యారు. ఆ షాక్ నుండి తేరుకున్న పిల్లలు , సిబ్బంది పరుగులు పెట్టారు. అయితే ఆడ్రీ కాల్పుల్లో ముగ్గరు పిల్లలు , ముగ్గురు స్కూల్ సిబ్బంది చనిపోయారు.
ఎమర్జెన్సీ కాల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయుధాలతో మహిళ కనిపించే సరికి ఆమెను కాల్చి చంపారు పోలీసులు. దాంతో భారీ ప్రాణనష్టం తప్పింది. కాల్పులకు తెగబడిన ఆడ్రీ హేల్ ఇదే పాఠశాల పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు విలపిస్తున్నతీరు అందరినీ కలిచి వేస్తోంది.