డిల్లీ లిక్కర్ స్కాం లో సీబీఐ దూకుడు పెంచింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు , ఎమ్మెల్సీ కవిత కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 6 న ఢిల్లీ లేదా హైదరాబాద్ లో సీబీఐ ముందు హాజరు కావాలని కోరింది. అయితే ఈనెల 6 న సీబీఐ ముందు హాజరు కాలేనని , గచ్చిబౌలి లోని మా ఇంటికి వచ్చి విచారణ చేసుకోవచ్చని తెలిపింది కవిత.
దాంతో కవిత ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లనున్నారు. డిసెంబర్ 6 మంగళవారం రోజున కవిత ను విచారించనున్నారు సీబీఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత పేరు ఉన్న విషయం తెలిసిందే.