కవిత : అక్షరాల. అద్దాల…
అక్షరాల అద్దాల ఏ ఆత్మలు ప్రత్యక్షమయాయో…..
నిక్షిప్తమై ఏ భావ శకలాలు రోదిస్తున్నాయో…
యూగాల
ప్రేమ ధార …. తప్తధారై రక్తధారై…
నా మనసు కంట
కురుస్తూనే ఉంది
చెట్టు పండవక ….
చేను. పంటవక …
మింటి చుక్కలు నేల
చూడక…
నది లాస్యం ఎపుడాగి పోయిందో….
సికరి కణ గణములు
సిగ్గునెలా తలవాల్చాయో….
మణి మాణిక్యాలను ముడిచిన మహి ఎండిన ఎడారి గొంతుకై…..
పువ్వులేని…
నవ్వులేని..
అంతటా…..
మోగని మువ్వలే
నిర్దయ వర్జన్య ప్రాఖర్య దుర్మార్గ ఉద్రేకాలే
ఏ ప్రాభవాన్ని పుడమి
ఆశిస్తోందో…
ఏ విషాదాన వియత్తలి
శోకిస్తోందో…..
ఏ జల ఘాతాల గర్జిత
తరగల కడలి
ఘూర్ణమౌతోందో…
ఏ చక్రగ్రాహాలనో చిక్కి. చక్కబడని స్నేహాల చలించు జనత….నవ యువత
ఏ పరిమితినాశిస్తోందొ…
.హృదయాహ్లాద గీతం..
సంగీతం…హితగీతం
మతం…సమ్మతం…
సమ్ముదం …మరచి…
విడిచి…
ఏ సముత్పత్తి కోసం
ఏ వైపు ప్రయుక్తి లేని
.ప్రయత్న రహిత పయనం…
సమత నవత కనరాని
ఏ దిక్కుల మొక్కుల
మొగసాల వైపుకి……
రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి