BRO పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే 4 రోజులు పూర్తి అయ్యింది.. మరి ఈ వీకెండ్ కు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 4 రోజుల్లో భారీ కలెక్షన్స్ రాబడుతుంది అని అనుకున్నారు.. అయితే ఓపెనింగ్స్ కుమ్మేసిన పవన్ ‘బ్రో’ ఆ తర్వాత వీకెండ్ లో కాస్త పర్వాలేదు అనిపించింది..
కానీ బ్రో సినిమాకు సోమవారం టెస్ట్ పెద్ద తలనొప్పిగా మారింది.. వీక్ డేస్ లో బ్రో సినిమా హవా కొనసాగించలేక పోయింది.. దీంతో మండే టెస్ట్ లో అట్టర్ ప్లాప్ అయ్యింది.. మరి 4వ రోజు బ్రో సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయంటే.. పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో ది అవతార్’ జులై 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయిన వీకెండ్ కావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.. అయితే మొదటి 3 రోజులు కలెక్షన్స్ చాలా బాగానే వచ్చాయి.. కానీ 4వ రోజు సోమవారం మాత్రం ఈ సినిమా విషయంలో పవన్ మార్క్ చూపించలేక పోయింది..
కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.. ఇక ఈ సినిమా 100 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది..
ఈ క్రమంలోనే 4వ రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో బ్రో కలెక్షన్స్ భారీగా పడిపోయినట్టు తెలుస్తుంది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 55.26 కలెక్షన్స్ షేర్, 91.75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టగా 4వ రోజు అందుతున్న సమాచారం ప్రకారం 5.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవచ్చని అంటున్నారు..
ReplyForward
|