గతకొంత కాలంగా పలువురు పారిశ్రామిక వేత్తలు ఏపీ కి గుడ్ బై చెబుతున్నారు. అదే సమయంలో తమ పెట్టుబడులను తెలంగాణ లో పెడుతున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో విసుగు చెందిన పారిశ్రామిక వేత్తలు ఏపీ లో వ్యాపారం చేయలేమని నిర్ణయించుకొని తమ పెట్టుబడులను ఏపీలో కాకుండా తెలంగాణ లో పెడుతున్నారు. అలా ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలు తెలంగాణకు తరలివచ్చారు.
తాజాగా ఆ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ కూడా చేరాడు. అమర్ రాజా పేరుతో గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ వ్యాపారం చేస్తున్నాడు. తమ పెట్టుబడులు ఏపీలో ఉన్నాయి. అయితే జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో గల్లా కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దాంతో ఇక లాభం లేదని ఏపీకి గుడ్ బై చెప్పి తెలంగాణలో ఏకంగా 900 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్నాడు. ఈరోజే తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.