నటసింహం నందమూరి బాలకృష్ణ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగించి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంతో బాలయ్య తన అసహనాన్ని , అసంతృప్తిని సోషల్ మీడియాలో వెల్లడించారు.
”మార్చెయ్యటానికి తీసెయ్యటానికి NTR అన్నది పేరు కాదు …. ఓ సంస్కృతి , ఓ నాగరికత , తెలుగుజాతి వెన్నెముక …..
తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు……. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…….. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త ….
అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు ……. పీతలున్నారు…… విశ్వాసం లేని వాళ్ళని చూసి కుక్కలు వెక్కిరిస్తునాయ్ ……. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు …. ” అంటూ ఘాటు పదజాలంతో జగన్ సర్కారు పై విరుచుకుపడ్డారు బాలయ్య. మీరు ఎన్టీఆర్ పేరు తీసేసినా ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉంటారనే విధంగా ఓ ఫోటో కూడా జత చేసారు బాలయ్య.
అయితే బాలయ్య వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి. బాలయ్య ఘాటు పదజాలం వాడారు కాబట్టి వైసీపీ నాయకులు కూడా బాలయ్య ను తీవ్ర స్థాయిలో విమర్శించడం ఖాయంగా కనబడుతోంది. ప్రస్తుతం బాలయ్య టర్కీలో షూటింగ్ లో పాల్గొంటున్నారు.