
కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు , కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. ధృవ నారాయణ తుదిశ్వాస విడిచారు. ధృవ నారాయణకు ఛాతిలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నారాయణకు చికిత్స అందించినప్పటికీ అప్పటికే ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మరణించారు. ధృవ నారాయణ మృతితో శోక సంద్రంలో మునిగింది ఆ కుటుంబం. కాంగ్రెస్ పార్టీ ధృవ నారాయణ మృతి పట్ల తీవ్ర విచారం వెలిబుచ్చింది.