తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. 9 రోజుల పాటు బతుకమ్మలను తీరొక్క పువ్వులతో పేర్చి ” ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ” అంటూ ఆటపాటలతో మహిళలు ఆడుకునే అరుదైన సంస్కృతి తెలంగాణలో ఉంది. ప్రకృతి లోని పూలనే బతుకమ్మగా పేర్చి దేవతగా కొలిచే అరుదైన పండుగ బతుకమ్మ. ఇక తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు మహిళలు.
మరో విశేషం ఏంటంటే ……. బతుకమ్మ పూర్తిగా మహిళల పండుగ అయినప్పటికీ , పురుషులు కూడా పాల్గొంటుండటం విశేషం. రాజకీయ నాయకులు , అలాగే వివిధ హోదాలలో పనిచేసే అధికారులు కూడా ఈ వేడుకలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో ఈ బతుకమ్మ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి. ఇక 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుగనున్నాయి. బతుకమ్మ వేడుకల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసారు. JSW , Jaiswaraaya మీడియా తరుపున కూడా పాఠకులకు, వీక్షకులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తోంది యాజమాన్యం.