40.1 C
India
Tuesday, May 7, 2024
More

    Bathukamma Celebrations 2023: న్యూజెర్సీలో వైభవంగా ‘ఎంగిలి పూల’ బతుకమ్మ..

    Date:

    Bathukamma Celebrations 2023
    Bathukamma Celebrations 2023 in Newjersey

    Bathukamma Celebrations 2023 in Newjersey : తెలంగాణ అతిపెద్ద సంప్రదాయ పండుగ ‘బతుకమ్మ’. సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు నిర్వహించే సంబురాలు తెలంగాణ పల్లె జీవనం, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తుంది. బతుకమ్మ అంటేనే మహిళల పండుగ. ‘ఎంగిలి పూల బతుకమ్మ’తో ప్రారంభమైన వేడుకలు తొమ్మిది రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతాయి. మొదటి రోజు బతుకమ్మ పేర్చేందుకు తెచ్చిన పూలను నోటితో ఊది వికసింప చేసి బతుకమ్మను పేరుస్తారు కాబట్టి దీనికి ఎంగిలిపూల బతుకమ్మ అని పేరు వచ్చింది.

    అమెరికాలోని న్యూజెర్సీలో ‘ఎంగిలి పూల’ బతుకమ్మ వేడుకలు వైభవోపేతంగా జరిగింది. 14 సంవత్సరాలుగా రవి దన్నపునేని, మహేశ్ పొగాకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఎడిషన్ లోని జాన్ పీ స్టీవెన్స్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఆనందంగా జరిగింది. బతుకమ్మలతో ముత్తయిదువలు ప్రాంగణానికి వచ్చి వాటిని ఒక దగ్గర ఉంచి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. పిల్లా, జల్లా ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని గౌరమ్మను వేడుకుంటూ సమీపంలో ఏర్పాటు చేసిన కొలనులో బతుకమ్మలను వదిలారు.

    నిమజ్జనం తర్వాత ఉత్తమ బతుకమ్మలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. బతుకమ్మ మొదలైన కొంత సేపటికి వర్షం పడింది. అయినా దాన్ని లెక్కచేయకుండా మహిళలు మరింత ఆనందంగా ఆడుకున్నారు. వారి ఆనందం చూసి నిర్వాహకులు కూడా మురిసిపోయారు. వాతావరణం అనుకూలించకున్నా ఎంగిలి పూల బతుకమ్మను సక్సెస్ చేయడంపై నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. బతుకమ్మ తర్వాత ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో అందరూ పాల్గొని తృప్తిగా భోజనం చేశారు.

    ‘ఎంగిలిపూల’ నుంచి ‘సద్దుల బతుకమ్మ’ వరకు ఈ సంబురాలు కొనసాగుతాయని నిర్వాహకులు చెప్తున్నారు. మొదటి రోజు వేడుకలకు తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ రావు, ఉపేంద్ర చివుకుల పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్ హాజరయ్యారు. ప్రసాద్ డీజే సహాకారం,  మిమిక్రీ ఆర్టిస్ట్ రమేశ్ పర్ఫార్మెన్ ఆడియన్స్ ను నవ్వుల్లో ముంచేసింది. రవి దన్నపునేని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబురాల్లో ప్రదీప్ సువర్ణ, మహేష్ పొగకు, రవి పెద్ది, భాస్కర్ భూపతి, శ్రీనివాస్ భర్తవరపు, ప్రవీణ్ తడకమళ్ల. గురు ఆలంపల్లి ఇందు బాస, సంగీతా ధన్నపునేని, కల్పన పాల్గొన్నారు. ఫొటో గ్రాఫర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ తీసిన చిత్రాలు చిరకాలం గుర్తుంచుకునేలా ఉన్నాయి.

    All Images Courtesy By Dr. Sivakumar Annad

    More Images : New Jersey Barhukamma 2023 Click here

    Share post:

    More like this
    Related

    PM Modi : పోలింగ్ బూత్ వద్ద మోడీకి రాఖీ కట్టిన మహిళ..

    PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో...

    No Rains : ఇక్కడ లక్షల సంవత్సరాల నుంచి వాన జాడే లేదు.. జీవరాశుల పరిస్థితి?

    No Rains : ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో...

    Elon Musk : రీ యూజ్ రాకెట్లు అయితే మరింత మేలు.. ఎలన్ మస్క్

    Elon Musk : అంతరిక్షంలోకి వ్యోమగాములు, సందర్శకులను పంపేందుకు రీ యూజ్...

    Parvati Melton : పార్వతి మెల్టన్ కు ఏమైంది.. ఇలా అయిపోయిందేంటీ?

    Parvati Melton : జల్సా మూవీ సినిమాలో ఇలియానా ఫస్ట్ హిరోయిన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    WETA Bathukamma celebrations : కాలిఫోర్నియాలోని” సాన్ రామోన్” నగరంలో ఘనంగా WETA ” బతుకమ్మ” సంబరాలు

    WETA Bathukamma" celebrations : కాలిఫోర్నియాలోని బే ఏరియాలో లో గల...

    Bathukamma Dussehra : పూల సింగిడి.. దసరా సందడి.. ప్రపంచవ్యాప్తంగా వేడుకలు..!

    Bathukamma Dussehra : విజయదశమి పండుగను దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా...

    Bathukamma Celebrations : డాలస్ లో బతుకమ్మ వేడుకలు.. ఎప్పుడంటే?

    Bathukamma Celebrations : తెలంగాణకు అతిపెద్ద పండుగ ‘బతుకమ్మ’. తెలంగాణ సంస్కృతిలో...

    Bathukamma: న్యూ జెర్సీలో బతుకమ్మ వేడుకలు.. ఎప్పుడంటే?

    Bathukamma: దేశం ఏదైనా మన సంస్కృతి, సంప్రదాయం, పద్ధతులను పాటిస్తూ ప్రపంచంలోనే...