
నిన్న రాత్రి ఒక్కరోజే 5,819 మంది మందుబాబులకు షాక్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ. మద్యం తాగి డ్రైవింగ్ చేసిన 5,819 మంది డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది నిన్న. న్యూ ఇయర్ జోష్ లో మందు బాబులు ఫుల్లుగా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేసింది.
మద్యం తాగి వాహనాలను నడపొద్దు అని పోలీసులు పదేపదే హెచ్చరించారు. అయితే మందుబాబులు మాత్రం ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టారు. ఒకవైపు పబ్ లు , రెస్టారెంట్ లు , బార్ ,వైన్ షాప్ లకు కాస్త దూరంలోనే పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇంకేముంది ఆ పక్కన తాగారు ఈ పక్కన పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అయితే కొంతమంది తమ వాహనాలను వదిలేసి పారిపోయారు. ఇక మరికొంతమంది అయితే పోలీసులతో గొడవకు దిగారు. అక్కడ తాగమని చెప్పి ఇక్కడ పట్టుకోవడం ఏంటి ? అని నిలదీశారు. దాంతో పలు చోట్ల పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.