
ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు విచారణకు హాజరు కావాల్సిన కవిత విచారణకు రాకపోగా సుప్రీంకోర్టులో ఈనెల 24 న విచారణ ఉన్నందున సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత మాత్రమే విచారణకు వస్తానని , అప్పటి వరకు రానని లేఖ రాసిన విషయం తెలిసిందే. దాంతో కవిత లేఖ ను పరిగణనలోకి తీసుకున్న ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈనెల 20 న విచారణకు రావాల్సిందిగా ఈడీ కోరింది. మరి ఈ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తుందో చూడాలి.